ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ… సమాజ్ వాది ఎమ్మెల్యే ఆజాం ఖాన్ చిక్కుల్లో పడ్డారు. మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాల కేసులో ఆయనకు ఇటీవల రాంపూర్ జిల్లా న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆజం ఖాన్ కు మూడేళ్ళ జైలు శిక్ష పడితే శాసనసభ్యత్వానికి అనర్హుడు అవుతాడు. సుప్రీం కోర్టు 2013లో ఇచ్చిన తీర్పు ప్రకారం రెండేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే MLA, MLC, MP పదవుల్లో ఉన్నవారు వారి పదవికి అనర్హుడు అవుతాడు. ఆజం ఖాన్ బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్ళారు.
న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయకపోతే శాసనసభ స్పీకర్ కూడా ఆజం ఖాన్ పై అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో యుపి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాత్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత సంజయ్ కుమార్, జిల్లా న్యాయాముర్తి పై అభ్యంతరకర రీతిలో ఆజం ఖాన్ వ్యాఖ్యలు చేశారు. గతంలో లోక్ సభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించిన ఎంపి రమాదేవి పై కూడా ఆజం ఖాన్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.