Monday, November 25, 2024
HomeTrending Newsనదీ జలాల్లో సమ న్యాయమే ధర్మం

నదీ జలాల్లో సమ న్యాయమే ధర్మం

కృష్ణా నదిమీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు… స్వీట్లు తినినిపించుకోవచ్చు. రెండు నిమిషాలు కూర్చొని సమస్యలు మాట్లాడుకోలేరా అన్నారు. హైదరాబాద్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో జగన్,కెసిఆర్ లపై పరోక్షంగా షర్మిల విమర్శలు సంధించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావటమే పార్టీ లక్ష్యమని షర్మిల ప్రకటించారు. కార్యక్రమంలో వై ఎస్ విజయమ్మతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది నదీ జలాల  బోర్డుల ద్వారా ఎందుకు సమస్య పరిష్కారం చేయడం లేదని షర్మిల విమర్శించారు. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధి ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలన్నారు. వైఎస్సార్ టిపి వైఖరి…. గోదావరి నది మీద ప్రాణహిత నుంచి కృష్ణా నది మీద పులిచింతల వరకు ఏ ప్రాజెక్టులో నైన తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని వదులుకోమని, ఇతర ప్రాంతాలకు చెందిన ఒక్క ఛుక్కా మాకు వద్దని షర్మిల స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని వైఎస్సార్ టిపి కోరుకుంటుందన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వైఎస్సార్ పేరు ఉచ్చరించే అర్హత లేదని షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ అసలైన వారసులం మేమేనని, యోడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసులం మేమే అని స్పష్టం చేశారు. బీజేపీ దగ్గర కేసీఆర్ కు సంబంధించిన అవినీతి చిట్టా ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదని, బీజేపీ, టిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయా అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ గురించి తప్పుగా మాట్లాడితే లక్షల్లో ఉన్న వైఎస్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారన్న షర్మిల సరిగ్గా వందరోజుల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్