పురుషుల టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది, బంగ్లా ఇచ్చిన 128 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి పాక్ సాధించింది.
గ్రూప్-2 నుంచి పాక్ తో పాటు ఇండియా కూడా సూపర్ 4 బెర్త్ సంపాదించింది. అయితే కాసేపట్లో జరగనున్న ఇండియా-జింబాబ్వే మ్యాచ్ తరువాత ఈ గ్రూప్ నుంచి ఎవరు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారో తేలుతుంది. దాన్ని బట్టే సెమీస్ లో ఏ జట్టుతో ఆడాలో కూడా నిర్ణయం కానుంది.
అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శాంటో-54 స్కోరు చేయగా ; అఫీఫ్ హొస్సేన్-24; సౌమ్య సర్కార్-20 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది నాలుగు; షాదాబ్ ఖాన్ రెండు; హారిస్ రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత పాకిస్తాన్ తొలి వికెట్ కు 54 పరుగులు చేసింది. రిజ్వాన్-32; మొహమ్మద్ హారిస్-31; కెప్టెన్ బాబర్ అజామ్-25; షాన్ మసూద్-24పరుగులతో రాణించారు.
నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రీది కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.