రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏం మాట్లాడారో వెల్లడించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్సీపీ నేత భరత్ మార్గాని డిమాండ్ చేశారు. ప్రదానిని కలిసిన తరువాతా ,మీడియాతో మాట్లాడిన పవన్ ఏమీ చెప్పలేకపోయారని, మరోవైపు సిఎం జగన్ కొట్లాడు ప్రజలు వీక్షిస్తున్న ఓ సభలో ఏపీ సమస్యమలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. జనసేన రోడ్ మ్యాప్ అంటే బిజెపిని జనసేన-తెలుగుదేశం పార్టీ తో పొత్తులో కలిసి వచ్చేలా చేయడమేనని, దానికోసమే పవన్ కు ప్యాకేజీ ఇస్తున్నారని, అది సాధ్యం కాలేదనే పవన్ మొహం అలా పెట్టారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి అనేది జగన్ అజెండా అయితే.. చినబాబును, పెదబాబును బిజెపితో కలవాలన్నదే పవన్ కళ్యాణ్ అజెండా అని భారత్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాకుండా బాబు-లోకేష్ ల భవిష్యత్తే మీ అజెండా అని దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రత్యేక హోదా వరకూ, విభజన హామీల నుంచీ విశాఖ పోర్టు వరకూ రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై సిఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారని భరత్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దే తమ అజెండా అని, అంతకు మించి వేరే అజెండా ఉండబోదని సాక్షాత్తూ ప్రధాని ఎదుట సిఎం జగన్ కుండబద్దలు కొట్టారని, అది ఒక నాయకుడి లక్షణమని భరత్ కొనియాడారు. పవన్ విశాఖ బీచ్ రోడ్ లోకి వెళ్లి ఫోటో షూట్, రీ షో తీసుకున్నారని భరత్ వ్యంగ్యంగా అన్నారు.
లోకేష్ పాదయాత్ర విషయం కూడా ప్రధాని వచ్చిన రోజే ప్రకటించారని, మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేశారని, ఇది కేవలం మోడీ దృష్టిలో పడేందుకేనని భరత్ విమర్శించారు.