Tuesday, September 24, 2024
HomeTrending Newsరేషన్ బియ్యం అక్రమ రవాణా..నిందితుల అరెస్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణా..నిందితుల అరెస్ట్

పేదలకు అందవలసిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్ రైల్వే గేటు సమీపంలో ఈ రోజు (బుధవారం) అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.

పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా తాండూర్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరు ఈ పనికి పురామయించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమికంగా లారీ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్