Sunday, November 24, 2024
HomeTrending NewsCM Jagan: బాబు హయంలో సాయంలోనూ కరువే: జగన్

CM Jagan: బాబు హయంలో సాయంలోనూ కరువే: జగన్

రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని, ఇప్పటికీ  దాదాపు 62శాతం మంది జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పేర్కొన్నారు.  అలాటి రైతును అన్నిరకాలుగా  ఆదుకుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని, దీన్ని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు.

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీరాయితీ సొమ్ముతో పాటు గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను సిఎం జగన్  క్యాంపు కార్యాలయంలో  జరిగిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.  జిల్లాలనుంచి రైతులు, అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది రైతులు సిఎం తో ముఖాముఖి లో పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు.

మంచి చేస్తున్న ప్రభుత్వానికి కచ్చితంగా దేవుడి దయ ఉంటుందని అందుకే తమ పాలనలో ఒక్క కరువు మండలాన్నీ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు 5 ఏళ్లపాలంలో సగటున సగం మండలాలు కరువు మండలాలుగానే ఉండేవని సిఎం గుర్తు చేశారు. అంతటి కరువు వచ్చినప్పటికీ సహాయం అందించడంలో కూడా కరువు చూపేవారని సిఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది జులై- అక్టోబరు మధ్యలో కురిసిన వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.40 కోట్లు ఇస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ 21.31 లక్షల మంది రైతులకు రూ.1834 కోట్లు ఇచ్చామని వివరించారు. సున్నా వడ్డీ పంటరుణాలకు సంబంధించి… గత రబీ, ఖరీఫ్‌లో రుణాలు చెల్లించిన వారికి 8,22,411 రైతులకు రూ.160.55 కోట్లు ఇస్తున్నామని తెలిపారు.  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుని 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు ఇచ్చామన్నారు.  రైతుల రుణాలన్నీ తొలి సంతకంతో మాఫీచేస్తానని చెప్పిన చంద్రబాబు రూ.87,612 కోట్లకు గాను ఐదేళ్ళలో ఇచ్చింది కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, పైగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశాడని విమర్శించారు.

Also Read :

కాసేపట్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీ రాయితీ జమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్