పెర్త్ లో ఆస్ట్రేలియా తో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ బ్రాత్ వైట్ 61; టి. చందర్ పాల్-51 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. షమ్రా బ్రూక్స్-33; బ్లాక్ వుడ్-36; హోల్డర్-27 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కెప్టెన్ కమ్మిన్స్ చెరో మూడు; లియాన్ రెండు; హాజెల్ వుడ్, గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ లో 315 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆసీస్ ఫాలో అవకాశం ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ (ఉస్మాన్ ఖవాజా-6) కోల్పోయి 29 పరుగులు చేసింది. మొత్తంగా 344 పరుగుల ఆధిక్యం ఆసీస్ సంపాదించింది.
Also Read : Steven Smith Double ton: ఆస్ట్రేలియా భారీ స్కోరు