Monday, November 25, 2024
HomeTrending Newsదూసుకొస్తున్న సౌర తుపాను

దూసుకొస్తున్న సౌర తుపాను

శక్తిమంతమైన సౌర తుపాను ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాని ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు ఆటంకం కలిగే అవకాశముందని చెప్పారు. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో పుడమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందన్నారు.

సోమవారం లోపు ఎప్పుడైనా అది మన గ్రహాన్ని తాకొచ్చని అంచనా వేశారు. తుపాను కారణంగా ఉత్తర/దక్షిణ ధ్రువ ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని పేర్కొన్నారు. సౌర తుపానుతో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫలితంగా ఉపగ్రహాలపై ప్రబావం పడి.. జీపీఎస్‌ నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడతాయన్నారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ముప్పుందనీ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్