Sunday, November 24, 2024
HomeTrending Newsఅంబేద్కర్ జయంతి, వర్ధంతికి కేసిఆర్ ఎందుకు రాడు - బండి సంజయ్

అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కేసిఆర్ ఎందుకు రాడు – బండి సంజయ్

 కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అతని రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తం, వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా? అని సవాల్ చేశారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాలోని మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బండి సంజయ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్  మాట్లాడుతూ…అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. వారం రోజులపాటు తెలంగాణలోని ప్రతీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తామన్నారు. తను ఈరోజు ఎంపీ ని అయ్యాను అంటే… అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని ప్రధాని మోదీ జీ పాలిస్తున్నారని తెలిపారు.
రామ్నాథ్ కోవింద్ గారిని భారత రాష్ట్రపతి ని చేసిన ఘనత బీజేపీ పార్టీదని, పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బిజెపిదన్నారు. అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే… ‘పంచ తీర్థాల’ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. 12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత, ప్రతి సంవత్సరం 1,20,000 మంది దళిత యువకులను, పారిశ్రామిక వేత్తలుగా మార్చుతున్న ఘనత బిజెపిదన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేశాడా? దళితులకు మూడెకరాల పంపిణీ హామీ ఏమైంది? కెసిఆర్ దృష్టిలో.. దళితుడికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసిఆర్ ఎందుకు బయటకు రాడు? కెసిఆర్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళతారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు… కేసీఆర్ అంతా పోటుగాడా? తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నాడు. ప్రశ్నించక పోవడంతోనే ముఖ్యమంత్రికి బలుపెక్కి, బరితెగించి ఈరోజు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని విమర్శించారు. జి 20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని పార్టీల అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే… కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు? జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముందని బండి సంజయ్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్