ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసేందుకు అవకాశం ఉంది. భూములు, రిజిస్ట్రేషన్ల ధరల పెంపుపైనా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీతో కృష్ణా జలాల వివాదం, కరోనా స్థితిగతులు, పల్లె, పట్టణ ప్రగతి, వ్యవసాయం సంబంధిత అంశాలపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.