Thursday, November 28, 2024
HomeTrending Newsకెటిఆర్ కు.. సంస్కారం బయటపడింది - డీకే అరుణ

కెటిఆర్ కు.. సంస్కారం బయటపడింది – డీకే అరుణ

దొంగలు పడ్డ ఆరు నెలలకు, కుక్కలు మొరిగినట్టుంది మంత్రి కేటీఆర్ సవాల్ ఉందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖందించిన అరుణ…రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసినప్పుడు… నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్ అని ప్రశ్నించారు. హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ… మంత్రి కేటిఆర్ వైఖరిని తప్పుపట్టారు. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే ఇవ్వలేదా…? అన్నారు. ఏ డ్రగ్ తీసుకున్నా… ఆ (ఉత్ప్రేరకం) డ్రగ్ ఆనవాళ్లు, మనిషి శరీరంలో డ్రగ్ ని బట్టి, 24 గంటలు, కొన్ని డ్రగ్స్ లో ఆరు నెలల నుంచి 9 నెలలు మాత్రమే ఉంటాయని, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు… రెండేళ్ల క్రితం బండి సంజయ్ చేసిన సవాల్ కు స్పందించకుండా… ఇప్పుడు నువ్వు ప్రతి సవాల్ విసిరితే ఏం లాభం అని కేటీఆర్ వైఖరిని తూర్పుర పట్టారు.

కేటిఆర్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత… బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేక, విదేశాలకు వెళ్లి, డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాక… నీ బాడీలో డ్రగ్ ఆనవాళ్లు ఏమి లేవని నిర్ధారించుకున్నాకే… దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్ అని డీకే అరుణ వ్యంగ్యంగా విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే.. నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే…. బండి సంజయ్ చేసిన సవాల్ కు, అప్పుడే ఎందుకు స్పందించలేదన్నారు. అప్పుడే నువ్వు నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్ సహా నీ బాడీలో ఇంకా ఏమైనా పార్ట్స్ ఉంటే… అవి ఇవ్వకుండా… ఇన్ని రోజులు ఎందుకు ఆగావు అని ప్రశ్నించారు. బండి సంజయ్ పై ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం?..సీఎం కొడుకై ఉండి, భవిష్యత్ సీఎం నువ్వే అని ప్రచారం చేయించుకుంటున్న నువ్వే… ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేస్తే… ప్రజలే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.

నీ ఉడత ఊపులకు… పిట్ట బెదిరింపులకు, పిల్ల చేష్టలకు ఇక్కడ ఎవరూ భయపడరని డీకే అరుణ అన్నారు. ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలో… ప్రజలే నిర్ణయిస్తారని, మీ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఫ్రష్ట్రేషన్ (అసహనం)లో సంస్కార హీనంగా మాట్లాడి యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నవ్ కెటిఆర్ ? నీ భాష మార్చుకో అని హితవు పలికారు. ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని మంత్రి కేటిఆర్ ను హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్