న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు ఆసక్తిగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగుల ఆధిక్యం సంపాదించిన కివీస్, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 277 పరుగుల వద్ద ఆటను డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్-62; కెప్టెన్ విలియమ్సన్-41; టామ్ బ్లండేల్-74; బ్రేస్ వెల్-74 పరుగులతో రాణించారు.
పాక్ బౌలర్లు నషీమ్ షా, మీర్ హంజా, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, ఆఘా సల్మాన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య పాకిస్తాన్ స్కోరు బోర్డులో ఒక్క పరుగు రాకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్, మీర్ హంజా లు డకౌట్ గా వెనుదిరిగారు. ఇమామ్ ఉల్ హక్ క్రీజులో ఉన్నాడు.
రేపు ఆటకు చివరిరోజు కావడంతో మొదటి టెస్టు లాగే ఈ మ్యాచ్ కూడా డ్రా అవుతుందా లేక కివీస్ మిగిలిన 8 వికెట్లు సాధించి విజయం సాధిస్తుందా అనేది వేచి చూడాలి