Sunday, November 24, 2024
HomeTrending News50 కోట్లతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్

50 కోట్లతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్

అత్యాధునిక వసతులతో కోహెడ లో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్ పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో షీఫ్ ఫెడరేషన్, విజయ డెయిరీ చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరానికి సమీపంలో రంగారెడ్డి జిల్లా కోహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో హోల్ సేల్ మార్కెట్ ను నిర్మించడం జరుగుతుందని చెప్పారు.

ఇందులో హోల్ సేల్ తో పాటు రిటైల్ మార్కెట్ ల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు వివరించారు. హోల్ సేల్ మార్కెట్ అందుబాటులోకి వస్తే చేపలకు మంచిధర లభించి మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ లను పరిశీలించి అధ్యయనం చేయాలని మంత్రి మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను ఆదేశించారు. అదేవిధంగా మత్స్యకారుల సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అర్హులైన మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ లో అవసరమైన శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

పశుసంవర్ధక శాఖ పై సమీక్ష సందర్బంగా మాట్లాడుతూ అన్ని జిల్లాలలో గొర్రెలు, మేకల మార్కెట్ ల నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని డైరెక్టర్ రామచందర్ ను మంత్రి ఆదేశించారు. పెద్దపల్లి, ఖమ్మ, కామారెడ్డి తదితర జిల్లాలలో స్థలాలను గుర్తించడం జరిగిందని అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, మిగిలిన జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్ ల సహకారంతో వారం రోజులలోగా స్థలాల సేకరణ చేపట్టాలన్నారు. గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని పిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 19 కోట్ల రూపాయల వ్యయంతో 57 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైనింగ్ సెంటర్ కు ఈ నెలలోనే శంఖుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పశువీర్యం (సెమెన్) నాణ్యతను పరీక్షించేందుకు గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి వద్ద నిర్మిస్తున్న పశువీర్య ఉత్పత్తి కోసం కేంద్రాన్ని మార్చిలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. విజయ డెయిరీ కి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకంతో పాటు జీవాలకు ఉచితంగా వైద్యం, మందులు, సబ్సిడీ పై దాణా, గడ్డి విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్