Monday, November 25, 2024
HomeTrending Newsహైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత

మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ నిఘా ఉంచారు. డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారుల నెట్‌వర్క్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్న కీలక స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నారు. నార్కోటిక్స్ డిజిగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కు ఇటీవలే కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం కూడా మట్టుపదార్తాల కట్టడి చేసేందుకు సంబంధిత శాఖలకు పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.

తాజాగా హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హయత్‌నగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 178 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. నైజీరియన్‌ వెనక లోకల్ ముఠాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల చరిత్రలో భారీ మొత్తంలో కొకైన్‌ పట్టివేత.

RELATED ARTICLES

Most Popular

న్యూస్