జనవరి 13 నుంచి ఓడిశాలో ప్రారంభం కానున్న పురుషుల ప్రపంచ కప్ హాకీ -2023 టోర్నమెంట్ కు సర్వం సిద్ధమైంది. భారత జట్టు ఇప్పటికే ఒడిశా చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టగా విదేశీ జట్లు ఇక్కడకు చేరుకుంటున్నాయి. నేడు స్పెయిన్, వేల్స్, కొరియా జట్లు ఓడిశాకు విచ్చేశాయి. ఆ జట్లకు విమానాశ్రయంలో సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
స్పెయిన్ జట్టు:
ఫెడరేషన్ అఫ్ వరల్డ్ హాకీ (ఎఫ్ ఐ హెచ్) ఆధ్వర్యంలో హాకీ ఇండియా-హాకీ ఓడిశా నేతృత్వంలో ఓడిశా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం తో పాటు- రూర్కెలా లో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలలో ఈ పోటీలు జరగనున్నాయి.
వేల్స్ జట్టు:
మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ లో జనవరి 13 ఆరంభం రోజున ఇండియా తన తొలి మ్యాచ్ ను స్పెయిన్ తో ఆడనుంది. ఇండియా, స్పెయిన్, ఇంగ్లాండ్, వేల్స్ జట్లు పూల్ డి లో ఉన్నాయి. ప్రతి జట్టూ మిగిలిన మూడింటితో ఆడుతుంది. మొత్తం నాలుగు పూల్స్ నుంచి ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటాయి.
కొరియా జట్టు
జనవరి 29న ఫైనల్ పోరు జరగనుంది