Monday, November 25, 2024
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ మహిళలదే పైచేయి

ఇంగ్లాండ్ మహిళలదే పైచేయి

ఇండియా – ఇంగ్లాండ్ క్రికెట్ మహిళా జట్ల మధ్య జరిగిన చివరి, నిర్ణాయక టి-20 మ్యాచ్ లో ఆతిథ్య జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత జట్టు కెప్టెన్ హర్మప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగురు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ షఫాలి వర్మ డకౌట్ గా వెనుదిరిగి నిరాశపరిచింది. మరో ఓపెనర్ స్మృతి మందాన 51 బంతులాడి 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. కెప్టెన్ కౌర్ 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 36 పరుగులు చేసింది.

154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోగి దిగిన ఇంగ్లాండ్ జట్టు 18.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టులో డ్యానీ వాట్ 56 బంతులాడి 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా ఎంపికైంది. మూడు టి-20 మ్యాచ్ ల సిరీస్ ను ఇంగ్లాండ్ ¬2-1 తేడాతో గెల్చుకుంది. నాట్ స్సివర్ ప్లేయర్ అఫ్ ద సిరీస్ పొందింది.

ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. జూన్ 16 నుంచి బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ లోనే జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. మూడు వన్డేల సిరీస్ ను కూడా ఇంగ్లాండ్ 2-1 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్