పురుషుల ప్రపంచ కప్ హాకీ-2023లో పూల్ ‘బి’ నుంచి బెల్జియం క్వార్టర్స్ లో నేరుగా బెర్త్ సంపాదించుకుంది. జర్మనీ, సౌత్ కొరియా జట్లు క్రాస్ ఓవర్స్ ఆడనున్నాయి.
భుబనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో జపాన్ పై బెల్జియం 7-1 తేడాతో గెలుపొందింది. తొలి పావుభాగంలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి, రెండో పావు భాగంలో బెల్జియం నాలుగు గోల్స్ చేసింది. మళ్ళీ మూడో పావు భాగంలో రెండు జట్లకూ గోల్ దక్కలేదు. చివరి పావు గంటలో బెల్జియం మూడు, జపాన్ ఒక గోల్ చేయగలిగాయి.
బెల్జియం 18,22,27,28, 51,52,56 నిమిషాల్లో ఏడు గోల్స్ చేయగా, వీటిలో ఆరు ఫీల్డ్ గోల్స్, ఒక పెనాల్టీ కార్నర్ ఉన్నాయి. జపాన్ ఓ ఫీల్డ్ గోల్ చేసింది. జపాన్ ప్లేయర్ బూన్ టామ్ ఏకంగా ఐదు గోల్స్ చేసి రికార్డు తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ సాధించాడు.
రెండో మ్యాచ్ లో… సౌత్ కొరియా పై జర్మనీ 7-2 తేడాతో విజయం సాధించింది, 2, 17,41,43, 51, 53,53 నిమిషాల్లో ఏడు గోల్స్ చేసింది. వీటిలో ఆరుఫీల్ద్ గోల్స్, ఒక పెనాల్టీ కార్నర్ ఉన్నాయి. కానీ సౌత్ కొరియా 15,60వ నిమిషాల వద్ద రెండు గోల్స్ చేసింది.
మూడు గోల్స్ చేసిన నిక్లస్ వెల్లెన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.