Sunday, November 24, 2024
HomeTrending Newsగల్ఫ్ కార్మికులపై కేంద్ర, రాష్ట్రాల వివక్ష - జీవన్ రెడ్డి

గల్ఫ్ కార్మికులపై కేంద్ర, రాష్ట్రాల వివక్ష – జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 1 లక్ష ఆర్థిక సాయం  చేసేవారని, కెసిఆర్ ప్రభుత్వం ఆ పథకాన్ని కనుమరుగు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా  భీమారం మండలం గోవిందారం గ్రామానికి చెందిన మోగుళ్ల శ్రీనివాస్, బీమారంకు చెందిన జూపాక గణేష్…ఇద్దరు గల్ఫ్ మృతుల కుటుంబాలను ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు కెసిఆర్  ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం హామీ నెరవేరడం లేదన్నారు. తెలంగాణ  గల్ఫ్ కార్మికులతో ఏటా రాష్ట్రానికి అమ్మకం పన్నుల రూపంలో రూ.1,400 కోట్లు ఆదాయం వస్తున్నదని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ గల్ఫ్ కార్మికుల వలన ప్రతి సంవత్సరం కేంద్రానికి రూ.14,000 కోట్ల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోందన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రు.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యం ‘స్థానికత’ ను సీఎం కెసిఆర్ నీరుగార్చుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు విద్యా సంస్థలలో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు అది శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి తదితరులతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్