ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని తాము ఎప్పుడో చెప్పామని, తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని, ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని పయ్యావుల నిలదీశారు. తాను ట్యాపింగ్ పై మాట్లాడినందుకే సెక్యూరిటీ తగ్గించారని ఆరోపించారు.ఇంటలిజెన్స్ సాఫ్ట్ వేర్ తో పాటు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మాల్ వేర్ తీసుకొని పలువురి ఫోన్లపై నిఘా పెట్టారన్నారు. ఎవరిపై నిఘా పెట్టారో, ఏ ఏ నంబర్లపై నిఘా పెట్టారో తెలియాలంటే వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.