ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం ఈరోజు ఉదయం చెన్నైలో మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయని ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈమేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఉదయం ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని పోలీసులకు పనిమనిషి తెలిపారు. దీంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పారు.
నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలున్నాయని, అప్పటికి ఆమె స్పృహలో లేరని పనిమనిషి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు తనిఖీ చేశారు. తర్వాత వాణీ జయరాం పార్థివ దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : వాణీ జయరాం గానం- పాటల బృందావనం