యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ గోల్డన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ అవార్డ్ తో పాటు క్రిటిక్స్ ఛాయిస్ న్యూయర్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్, జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండిగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హాలీవుడ్ ప్రముఖులంతా అత్యంత ప్రతిస్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో వుంది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చరిత్ర సృష్టించింది. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఈ అవార్డు వేడుక అత్యంత అట్టహాసంగా జరగబోతోంది. ఇందులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ భారీ స్థాయిలో పాల్గొనబోతున్నారు. 95వ ఆస్కార్ అవార్డుల వేడుక కోసం యావత్ ప్రపంచ దేశాలతో పాటు ఈసారి ప్రత్యేకంగా మన దేశం ప్రేక్షకులు కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ అవార్డుల్లో అనుకున్నట్టుగానే ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంట్ కు గానూ ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ పురస్కారాన్ని దక్కించుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా వుంటే అత్యంత ప్రతిష్టాత్మంగా మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్ పురస్కార వేడుకలో కీరవాణి అరుదైన ఫీట్ కు రెడీ అవుతున్నారే వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే.. ఈ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ ని ప్రదర్శించమని సంగీత దర్శకుడు కీరవాణితో పాటు గేయ రచయిత చంద్రబోస్ కు ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ కోసం జయహో సాంగ్ కు అవార్డులని అందుకున్న క్రమంలో రెహమాన్ ని కూడా ఆస్కార్ కమిటీ ఇదే తరహాలో ఆహ్వానించింది. మళ్లీ ఇన్నాళ్లుకు అ అరుదైన ఫీట్ కోసం కీరవాణి కి ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికిందని సమాచారం. ఇదే కనుక నిజమైతే.. ఆర్ఆర్ఆర్ నాటు నాటుకు ఆస్కార్ వచ్చినట్టే అంటున్నారు సినీజనాలు. మరి.. ఏం జరగనుందో..?
Also Read : ‘నాటు నాటు’ కు గోల్డెన్ గ్లోబ్