పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం వైఎస్ జగన్ సోమవారం క్షేత్రస్ధాయిలో పరిశీలించ నున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు.
- ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం
- 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన
- 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశం
- 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం