Sunday, November 24, 2024
HomeTrending Newsమనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం - బిఆర్ఎస్

మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం – బిఆర్ఎస్

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. మనీష్ సిసోడియా అరెస్టు ప్రజాస్వామికం… బిజెపి పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను బిజెపి చేస్తుంది. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్.

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి అరెస్టులు చేస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో.. దేశమంతా చూసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్నది. ఆప్ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని హరీష్ విమర్శించారు.

Also Read : Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్