Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్మరో అథ్లెట్, తొమ్మిది మంది సిబ్బందికి  కరోనా

మరో అథ్లెట్, తొమ్మిది మంది సిబ్బందికి  కరోనా

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఒక విదేశీ అథ్లెట్ తో పాటు ఎనిమిదిమంది ఇతర సిబ్బంది నేడు కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ధారించినట్లు క్యోడో న్యూస్ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో  విశ్వ క్రీడా సంబరాలు మొదలు కానున్న తరుణంలో ఇలా అథ్లెట్లు ఒక్కొక్కరు కోవిడ్ బారిన పడుతుండడం నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ అథ్లెట్ పేరు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ అతణ్ణి  ఐసోలేషన్ కు తరలించారు.

సోమవారం చెక్ రిపబ్లిక్ కు చెందిన బీచ్ వాలీబాల్ ఆటగాడు ఆండ్రెజ్ పెరుసిక్ కోవిడ్ బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతణ్ణి ఐసోలేషన్ లో ఉంచారు. అంతకు ముందు చీబాలోని ఇంజై లో శిక్షణ తీసుకుంటున్న అమెరికాకు చెందిన ఓ మహిళా జిమ్నాస్ట్  కరోనా బారిన పడ్డారు. వీరిద్దరితో పాటు నేడు కొత్తగా కోవిడ్ బారిన పడ్డ అథ్లెట్ తో కలిపి మొత్తం ముగ్గురు ఆటగాళ్ళ కు పాజిటివ్ అని తేలింది.

తమ దేశానికి చెందిన క్రీడా బృందంతో టోక్యో వచ్చిన చెక్ రిపబ్లిక్ కు చెందిన ఓ అధికారికి కూడా కరోనా సోకింది. ఎయిర్ పోర్ట్ లో చేసిన పరీక్షల్లోనే కరోనా అని నిర్ధారణ కావడంతో సదరు అధికారిని కూడా ఐసోలేషన్ కు పంపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్