Tamil Heroes And Directors Eye On Telugu Film Industry :
కరోనా దెబ్బతో తెలుగు సినిమాలో మార్పులు చాలా జరిగాయి. థియేటర్లు మూయడంతో ప్రేక్షకులు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకు అలవాటు పడ్డారు. దాంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అనే తేడా లేకుండా పోయింది. గతంలో తమిళ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేయడానికి అస్సలు ఒప్పుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల సినిమా అనౌన్స్ మెంట్ రాగానే ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలోని విశ్లేషకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మొదట్నుంచి తమిళ, మలయాళ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలంటే చిన్న చూపు. అందుకే మన సినిమాలను వాళ్లు అనువదించడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.
ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగతా వాటినన్నటినీ దూరంగా వుంచుతూ వుంటారు. అలాంటిది ఇప్పుడు తమిళ హీరోల చూపు తెలుగు దర్శకుల మీద పడింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల సినిమా అనౌన్స్ అవ్వగానే రామ్ చరణ్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్ శంకర్ ముందుకొచ్చాడు. అలాగే ఇప్పుడు విశాల్ హీరోగా బోయపాటి ఓ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిసింది. రామ్ హీరోగా లింగుస్వామి తో సినిమా నిర్మాణంలో వుండటం ఇవన్నీ చూస్తుంటే ముందు ముందు ఓటీటీల పుణ్యమా అని తెలుగు, తమిళ సినిమాల మధ్య వున్న అడ్డు గోడలు తొలగిపోయే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read : ‘కేజీఎఫ్’ హీరోతో బోయపాటి సినిమా?