Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్WPL: మహిళా క్రికెట్ కు నవశకం- నేడే ఆరంభం

WPL: మహిళా క్రికెట్ కు నవశకం- నేడే ఆరంభం

మహిళా క్రికెట్ కు మరింత ఊతమిచ్చేందుకు, వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బిసిసిఐ చేపట్టిన మరో విప్లవాత్మక అడుగుకు నేడు శ్రీకారం పడుతోంది. విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్ నేడు నవీ ముంబైలో మొదలు కానుంది.

దేశవాళీ క్రికెట్ టి20 టోర్నమెంట్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008లో మొదలై…నాటి నుంచి నేటి వరకూ ప్రపంచ క్రికెట్ అభిమానులకు నిజమైన పండుగ అందిస్తూ సూపర్ హిట్ అయ్యింది. ఈ కోవలోనే మహిళలకూ టి 20 లీగ్ అధికారికంగా నిర్వహించాలని బిసిసిఐ చేసిన ప్రయత్నాలు ఈనాటికి ఫలించాయి.

మొత్తం ఐదు జట్లు… ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రేపటి ఆరంభ మ్యాచ్ లో ముంబై  ఇండియన్స్- గుజరాత్ వారియర్స్  లు తపపడనున్నాయి. మార్చి 26న బ్రాబౌర్న్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

కృతి సనన్, కియారా అద్వానీ, దిల్హాన్ లు రేపటి ఆరంభ వేడుకలో తమ ఆటా పాటతో ప్రేక్షకులను అలరించనున్నారు.

భారత స్టార్ ప్లేయర్లు హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై; ఈ టోర్నీలో అత్యధిక ధర పలికిన స్మృతి మందానా బెంగుళూరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా…..  ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ- గుజరాత్; అలేస్సా హీలీ-యూపీ; మెగ్ లన్నింగ్-ఢిల్లీ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.  భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గుజరాత్ కు మెంటార్ గా ఉన్నారు.

ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు తొలి మ్యాచ్ నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్