విమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగుళూరుపై 9 వికెట్లతో ముంబై ఘన విజయం సాధించింది. ముంబై కు ఇది వరుసగా రెండో విజయం కాగా, బెంగుళూరుకు రెండో ఓటమి. ముంబై బ్యాట్స్ విమెన్ హేలీ మాథ్యూస్ 38బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్సర్ తో 77; నటాలీ 29 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచి తిరుగులేని విజయం అందించారు.
ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్చీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రిచా ఘోష్-28; స్మృతి మందానా-23; శ్రేయంకా పాటిల్-23; కనిక అహుజా -22; చివర్లో మేగాన్ స్కట్ -20 రన్స్ చేయడంతో 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగినిది. పూర్తి ఓవర్లు ఆడక ముందే 18.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది.
ముంబై బౌలర్లలో హెలీ మాథ్యూస్- 3; సైకా ఇషాక్, అమేలియా కెర్ర్ చెరో 2; నాటాలి స్కివార్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.
ముంబై తొలి వికెట్ (యస్తికా భాటియా-23) కు 45 పరుగులు చేసింది. ఆ తర్వాతా హేలీ మాథ్యూస్- నాటాలి స్కివర్ రెండో వికెట్ కు అజేయంగా 114 పరుగులు జోడించి 14.2ఓవర్లలోనే గెలిపించారు.
ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన హేలీ మాథ్యూస్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.