Saturday, September 21, 2024
HomeTrending NewsArun Subramanian : న్యూయార్క్ జ‌డ్జిగా అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

Arun Subramanian : న్యూయార్క్ జ‌డ్జిగా అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

భార‌తీయ సంత‌తికి చెందిన అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌.. అమెరికాలో జిల్లా జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. న్యూయార్క్ ద‌క్షిణ జిల్లా జ‌డ్జిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. న్యూయార్క్ బెంచ్‌లో జ‌డ్జిగా సేవ‌లు అందించ‌నున్న తొలి సౌత్ ఏషియా జ‌డ్జిగా ఆయ‌న నిలుస్తారు. 58-37 ఓట్ల తేడాతో ఆయ‌న నామినేష‌న్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. పెన్సిల్వేనియలోని పిట్స్‌బ‌ర్గ్‌లో ఆయ‌న 1979లో జ‌న్మించారు. 1970 ద‌శ‌కంలో ఆయ‌న పేరెంట్స్ అమెరికా వ‌ల‌స‌వెళ్లారు. సుబ్ర‌మ‌ణియ‌న్ తండ్రి ప‌లు కంపెనీల్లో కంట్రోల్ సిస్ట‌మ్స్ ఇంజినీర్‌గా చేశారు. ఆయ‌న త‌ల్లి కూడా అనేక ఉద్యోగాలు చేశారు. బుక్‌ కీప‌ర్‌గా కూడా ఆమె ప‌నిచేశారు.

మరోవైపు అమెరికాలో డిస్ట్రిక్ట్‌ జడ్జిగా ఇండో అమెరికన్‌ మహిళ తేజల్‌ మెహతా నియమితులయ్యారు. మసాచుసెట్స్‌లో అయెర్‌ జిల్లా కోర్టు జడ్జిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఆమె ఇదే కోర్టులో అసోసియేట్‌ జడ్జిగా పనిచేశారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన తేజల్‌ పూర్వీకులు భారతీయులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్