విమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగుళూరు వరుసగా మూడో పరాజయం మూట గట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ 11 పరుగులతో బెంగుళూరుపై విజయం సాధించింది. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సబ్బినేని మేఘన (8) త్వరగా ఔటైనా సోఫియా డంక్లీ- హర్లీన్ డియోల్ రెండో వికెట్ కు 60 పరుగులు జోడించారు. డంక్లీ 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 65; హర్లీన్ డియోల్ 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 67 పరుగులతో రాణించారు. గార్డ్ నర్-19; హేమలత-16, సుదర్లాండ్-14 రన్స్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది.
బెంగుళూరు బౌలర్లలో శ్రేయంకా పాటిల్, హైదర్ నైట్ చెరో 2; మేగాన్ స్కాట్, రేణుకా సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్యం భారీగా ఉండడంతో బెంగుళూరు ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. జట్టు స్కోరు 54వద్ద కెప్టెన్ స్మృతి మందానా (18) ఔటైంది. సోఫీ డివైన్ 45బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66; ఎలిస్ పెర్రీ 25బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులతో రాణించారు. చివర్లో హిదర్ నైట్ 11 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 30; శ్రేయాంకా పాటిల్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 11 రన్స్ తో ఇద్దరూ నాటౌట్ గా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్ నర్ 3; సుదర్లాండ్ 2, మన్షి జోషి 1 వికెట్ పడగొట్టారు.
సోఫియా డంక్లీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.