విజయవాడ స్వరాజ్ మైదానంలో డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ 125అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన సిఎం.. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ జి విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.