జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 11న మధ్యాహ్నం 2 గంటలకు పవన్ సారధ్యంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.
12వ తేదీ ఉదయం 11గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పార్టీలో చేరికల కార్యక్రంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ అవుతారు.
13వ తేదీ ఉదయం 11గంటలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షిస్తారు. సాయంత్రం 5 గం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.
14న పార్టీఆవిర్భావం సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంటకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మచిలీపట్నంలో జరిగే బహిరంగ సభకు బయల్దేరుతారు. ఆటోనగర్ గేట్, తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు-గుడివాడ సెంటర్ మీదుగా సాయంత్రం 5గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
సభ అనంతరం గన్నవరం చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.