చైనా నూతన ప్రధానిగా లీ కుయాంగ్ ఎన్నికయ్యారు. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. లీ కుయాంగ్ పేరును ప్రతిపాదించారు. గతంలో ఆయన కమ్యూనిస్టు పార్టీ నేతగా చేశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో జీ జిన్‌పింగ్ ఈ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న సుమారు 2900 మంది ప్రతినిధులు దాదాపు లీ కుయాంగ్‌కే ఓటేశారు. 63 ఏళ్ల కియాంగ్.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడు. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థను సరిచేసే బాధ్యతల్ని లీ కుయాంగ్ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.