కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, మీడియా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుసన్నారు. 70 వేల కోట్ల అవినీతితో 2జీ, కోల్ గేట్ కు తీసిపోని స్కాం కాళేశ్వరమని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా ఇంత వరకు ఏ విచారణ చేపట్టలేదన్నారు. రేపు (15వ తేదిన ) వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం మొత్తం, పార్లమెంట్ సభ్యులకు కాళేశ్వరం గురించి తెలిసేలా చేయాలని నిర్ణయించామన్నారు. కాళేశ్వరం అవినీతిపై రేపు ఢిల్లీలో జరిగే ధర్నాకు ప్రతిపక్ష ఎంపీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవన్ వరకు జరిగే మార్చ్ లో పాల్గొని, సంఘీభావం తెలపాలని కోరుతున్నాం. ప్రజల కోసం చేపడుతున్న పోరాటంలో పాల్గొని, కాళేశ్వరం అవినీతిపై గొంతు విప్పాలని మనవి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ తో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుంతోంది..కేసీఆర్ వాళ్ల గురించి పట్టించుకున్నారా? కేసీఆర్ 80 శాతం ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తుంటే కాంగ్రెస్ బీజేపీలు మెగా క్రుష్ణా రెడ్డి, కేసీఆర్ అవినీతిపై ఎప్పుడైనా మాట్లాడినయా? ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి మెగా కృష్ణా రెడ్డి దగ్గర డబ్బు తీసుకొని నోరు తెరిచి ప్రశ్నించడం లేదు. బండి సంజయ్ కూడా డబ్బులు తీసుకున్నారు కాబట్టే మాట్లాడం లేదా? అందరూ మాటలు చెబుతున్నారు కానీ విచారణ చేయడం లేదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయడం లేదని వైయస్ షర్మిల ప్రశ్నించారు. మేం ఏ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా ప్రశ్నిస్తున్నాం..ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫుున నిలబడాల్సిన బాధ్యత లేదా? బీఆర్ఎస్ ఎంపీలు కూడా దీనిపై ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read : సిఎం బిడ్డ 33 శాతం రిజర్వేషన్ల డ్రామాలు – షర్మిల