ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం కిందకే వస్తుందని ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఇలాంటి చర్యలని ఆరోపించారు. ఎఐసిసి పిలుపుతో రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం ఉంటుందని, ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ లఫై ఇన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు మోదీ స్పందించలేదని, ప్రభుత్వం ఇంత విచ్చల విడిగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం దారుణమని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గత ఎన్నికల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లతో నే గెలిచారని, సోనియా గాంధీ,రాహుల్ గాంధీ ల ఫోన్ లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ,ప్రధాని మోదీ లు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.