Thursday, November 28, 2024
HomeTrending Newsఫసల్ బీమాతో బీమా కంపెనీలకే మేలు - మంత్రి నిరంజన్ రెడ్డి

ఫసల్ బీమాతో బీమా కంపెనీలకే మేలు – మంత్రి నిరంజన్ రెడ్డి

వికారాబాద్ జిల్లాలో అకాలవర్షం, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఈ రోజు పరిశీలించారు. మర్పల్లి, మోమిన్ పేట్ మండలాల్లో పర్యటించిన మంత్రులు రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మర్పల్లి లో హెలిప్యాడ్ సమీపంలో రైతులనుద్దేశించి మంత్రులు మాట్లాడుతూ…రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.రేపటిలోగా పంట నష్టం పై సమగ్ర నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ కమిషనర్,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు మంత్రులు ఆదేశించారు. బిజెపి అధికారంలోకి వస్తే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం అన్నారు ఇప్పటి వరకు దాని ఊసులేదన్నారు. గతంలో చాలా సార్లు కేంద్రానికి చెప్పాము..పంట నష్టం జరిగితే బీమా వచ్చే విధంగా చూడాలని కోరాం … మనిషికి, వాహనాలకు భీమా ఉంటది కానీ పంటలకు ఉండదా అన్నారు. కేంద్రం చెబుతున్న ఫసల్ బీమా అమలు చేశాము, కాని దాని ద్వారా రైతుకు వచ్చేది తక్కువ. బీమా కంపెనీలకు లాభం ఎక్కువ… రైతు కేంద్రంగా పంటలకు భీమా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

మంత్రుల వెంట రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఉద్యాన సంచాలకులు హనుమంతరావు గారు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు,కలెక్టర్ నారాయణ్ రెడ్డి గారు,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వడగళ్ల వర్షం

RELATED ARTICLES

Most Popular

న్యూస్