Sunday, November 24, 2024
Homeసినిమాఉగాది రోజున బ్రహ్మానందానికి ఘన సన్మానం

ఉగాది రోజున బ్రహ్మానందానికి ఘన సన్మానం

ఎఫ్. ఎన్. సి. సి ( ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాది సందర్భంగా ప్రముఖ నటుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందాన్ని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సత్కరించబోతోంది. ఉగాది రోజు అంటే ఈనెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు బ్రహ్మానందం ఘనంగా సత్కరించబోతోంది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాల వారు మాత్రమే కాకుండా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఇక ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా శుక్రవారం ఉదయం ఎఫ్. ఎన్. సి. సి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, కమిటీ మెంబర్ పెద్దిరాజు, గోపాలరావు, ఎఫ్. ఎన్. సి. సి కల్చర్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ కొండేటి బ్రహ్మానందం నివాసానికి వెళ్లి కోరారు.

ఇదిలా ఉంటే.. బ్రహ్మానందం ‘రంగమార్తాండ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించాడు. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రం ఉగాది రోజున విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వారం రోజుల ముందు నుంచి ప్రివ్యూ వేస్తున్నారు. రంగమార్తాండ ప్రివ్యూ చూసిన వాళ్లందరూ బ్రహ్మానందాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని పాత్రలో చూపించారు. అద్భుతంగా నటించారు అంటూ అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్