Tuesday, February 25, 2025
HomeసినిమాRangamarthanda: 'రంగమార్తాండ' అందరూ చూడాల్సిన సినిమా - బ్రహ్మానందం

Rangamarthanda: ‘రంగమార్తాండ’ అందరూ చూడాల్సిన సినిమా – బ్రహ్మానందం

Brahmanamdam: హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగమార్తాండ‘. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషించారు. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ… మొదట కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ వచ్చి ఈ సినిమాలో నన్ను నటించాలని అడిగినప్పుడు కొంత ఆశ్చర్యపోయాను. మీరు తప్పితే ఈ పాత్రకు ఎవరు సరికారు అని కూడా అన్నారు. కొన్ని సన్నివేశాలు పూర్తి చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ ఓ రాత్రి ఫోన్ చేసి ఈరోజు షూటింగ్లో మీరు చేసిన సీన్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేవారు. ఆ విషయం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. ఆయన చెప్పారు అంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ తెలుగు వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా అతనికి తెలుగు పై చాలా పట్టుంది. అందులో సినిమాలోని డైలాగ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడో కానీ అద్భుతంగా చెప్పాడు.

కొన్ని సన్నివేశాలు బాగా రాకపోయినప్పటికీ కూడా కొన్ని సీన్స్ కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అని మొదట అన్నారు కానీ.. ఆ తర్వాత మళ్లీ సింగిల్ టేక్ లోనే కావాలని అన్నారు. ఆ తర్వాత నేను సింగల్ టేక్ లోనే చేయడం జరిగింది. దీంతో ప్రకాష్ రాజ్ పక్కనే ఉండి ఇది వన్ మోర్ అన్నావంటే చంపేస్తాను అని కృష్ణవంశీకి హెచ్చరిక చేశాడు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కృష్ణవంశీ ఎంతో చక్కగా తెర పైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ విశ్వరూపం చూపించారు. అలాగే రమ్యకృష్ణ మిగతా నటీనటులు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఇక ఇలాంటి సినిమాలు అందరూ చూడాలి. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది అని అన్నారు.

Also Read : ఉగాది రోజున బ్రహ్మానందానికి ఘన సన్మానం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్