గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శాకుంతలం’. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ప్లానింగ్ ప్రకారం చక చకా జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేశారు. అలాగే ప్రతి పాత్రను ఎంతో గొప్పగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు మేకర్స్. వీటి కోసం ఏం చేశారు..? ఎలాంటి రీసెర్చ్ జరిగింది.? వంటి విషయాల పై యూనిట్ సభ్యులు పాత్రికేయలతో ప్రత్యేకంగా మాట్లాడారు.
గుణశేఖర్ మాట్లాడుతూ… ‘‘నిజమైన బంగారం వాడాం శాకుంతలంలో. ఈ ఐడియా ఫస్ట్ నందమూరి తారక రామారావు దానవీరశూరకర్ణలో ధరించారు. ఆయన మనందరికీ స్ఫూర్తినిచ్చారు. ఇలాంటి మైథలాజికల్ మూవీస్‌కి ఆయనే మూలకారకుడు. వసుంధర జువెలర్స్ బ్యానర్ మాతో అసోసియేట్ అవుతుందంటే ఆనందంగా అనిపించింది. నీలిమ వాళ్లకు తీసుకొచ్చింది. వాళ్లకి కూడా టేస్ట్ ఉండటం వల్ల ఇమీడియేట్‌గా వచ్చారు. ఇలాంటి వారందరినీ శాకుంతల ప్రాజెక్ట్ అట్రాక్ట్ చేసింది. సమంత గారితో మొదలుపెట్టి, ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ కి అసోసియేషన్ అవ్వాలో, అందరినీ అట్రాక్ట్ చేసింది ప్రాజెక్టు. దాదాపు 14 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు వాడాం. బంగారం మాత్రమే కాదు, రియల్ డైమండ్స్ వాడాం. దేవ్‌మోహన్ లుక్, సమంత గారి లుక్ అందరూ చూశారు.
ప్రతి రోజూ ఆర్టిస్టులు సెట్‌కి ఎగ్జయిట్‌మెంట్‌తో వచ్చేవారు. నేహా గారు, నీతాలుల్లా గారు డిజైన్ చేసిన జువెలరీని చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వచ్చేవారు. క్వీన్ లుక్ వచ్చినప్పటి నుంచి సమంతగారి ఎగ్జయిట్‌మెంట్ చాలా ఎక్కువగా అనిపించింది. అవి చాలా బరువు. వాటిని హుందాగా క్యారీ చేయడం చాలా బాగా అనిపించింది. అందరికీ కళల పట్ల ఉన్న అభిమానమే చాలా బాగా వచ్చింది. మధుబాలగారు మేనకగా చేశారు. ఆమె జువెలరీ రియల్ డైమండ్స్ తో చేశాం. ఆమె ఒంటిమీద ఉన్న నగలు దాదాపు ఆరు కోట్ల విలువ చేశాయి. వాళ్లు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏప్రిల్ 14న కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. శాకుంతలం అనగానే వనంలో కనిపించేదే కాదు, రాచరికంలో ఉన్న వైభవాన్ని కూడా చూసి ఆస్వాదిస్తారు. వసుంధర ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కష్టపడి చేశారు. చిన్న డీటైల్ కూడా మిస్ కాకుండా పనిచేశారు. ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారు. బెస్ట్ పీపుల్ కలిసి ఇదంతా చేశారు. ఖచ్చితంగా అందరూ ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
Also Read : ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘మల్లికా మల్లికా..’సాంగ్ రిలీజ్