సస్పెండ్ చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధిష్టానం తనకు షాక్ ఇచ్చిందని, దాని నుంచి తేరుకున్న తరువాత ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆలోచిస్తానని తాడికొండ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నందున అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతిస్తానని, త్వరలోనే రాజధాని ప్రాంతంలో పర్యటించి ఉద్యమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కుక్కను చంపే ముందే దానిపై పిచ్చి అనే ముద్ర వేసినట్లు తనపై కూడా పథకం ప్రకారం కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భర్త డాక్టర్లుగా ఉన్నామని, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సస్పెండ్ చేసేముందు నోటీసు ఇస్తారని, కనీసం ఇల్లు ఖాళీ చేయాలన్నా నోటీసు ఇస్తారని కానీ ఎకపక్షంతా సస్పెండ్ చేశారని ఆరోపించారు.
ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన వాటిలో ముఖ్యాంశాలు:
- గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు
- నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారు
- మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళాను
- వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు
- నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా?
- నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు, మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు
- వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు, నన్ను ఎందుకు వేధిస్తున్నారు
- నన్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారు
- డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు పార్టీ అంటే అలాంటి విలువలు ఉంటాయి అని అనుకున్న
- ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరేది లేదు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే కొనసాగుతా
- అమరావతి రైతులకు మాట ఇస్తున్న, ప్రాణం పోయినా మీకోసం కొట్లాడతా
- మన అమరావతి మన రాజధాని అని నినాదం చేస్తా
- సజ్జల నుంచి నాకు ప్రాణహాని ఉంది
- వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా