Sunday, November 24, 2024
HomeTrending Newsరాజమండ్రిలో మహానాడు

రాజమండ్రిలో మహానాడు

ఈ ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. రేపు హైదరాబాద్ లో నిర్వహించనున్న పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించింది. రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మొత్తం వంద ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.

మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం మూడు కమిటీలు వేయాలని, ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయించాలని సమావేశం నిర్ణయించింది.  ఈ భేటీ  వివరాలను ఏపీ, తెలంగాణా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞాజేశ్వర్ ముదిరాజ్ లతో పాటు కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తగిన సమయం ఇవ్వకుండా లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడం తప్పేనని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఎం జగనే మర్చిపోయి మా పార్టీ అభ్యర్ధికి ఓటు వేసి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. సైకిల్ గుర్తుపై గెలిచినా ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశంలో సంక్షేమం అనే పదానికి అర్ధం చెప్పిందే తమ పార్టీ అని, రెండు రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్