బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు(ఫెమా) ఉల్లంఘనల కింద కేసు రిజిస్టర్ చేశారు. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలని బీబీసీని కోరారు. బీబీసీ నిర్వహించిన విదేశీ లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలోనే ఫెమా ఉల్లంఘనల కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అకౌంట్ పుస్తకాలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ను రిలీజ్ చేయాలని బీబీసీని ఈడీ కోరింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం బీబీసీపై ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఆ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో బీబీసీ ఉద్యోగులను ఆఫీసుల్లో విచారించిన విషయం తెలిసిందే.