అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. ఫామ్‌లోని 90 శాతం గోవులను మృత్యువు కబళించింది. ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న ఒక స్త్రీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హుటాహుటిన హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు.
మృతిచెందిన ఒక్కో ఆవు సుమారు రూ.1.63 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఓ ప్రమాదం కారణంగా ఈ స్థాయిలో పశువులు మృతిచెందటం ప్రపంచంలోనే అత్యధికమని అంచనా. ఎరువుల ట్యాంక్ అతిగా వేడి కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.