Sunday, November 24, 2024
HomeTrending NewsCM Review: లీకేజీలు అరికట్టాలి: సిఎం జగన్

CM Review: లీకేజీలు అరికట్టాలి: సిఎం జగన్

ఆదాయాలను ఆర్జించే శాఖల్లో  మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ర ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. దీనిపై  అధ్యయనం చేసి వచ్చే సమావేశంలో తనకు నివేదించాలని కోరారు. ఆదాయన్ని సమకూర్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎంకు అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది.

సరైన విధానాలను అమలు చేయడంద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సిఎం అన్నారు.

అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం…

 స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 2018-19లో రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు చేరింది

2018-19 తో పోలిస్తే  2022-23లో 12.61 శాతం లిక్కర్‌ వినియోగం తగ్గింది

గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యం కాగా, 4,756 కోట్లు వసూలుతో 26 శాతం వృద్ధి కనబడింది. ఈ  ఆర్ధిక సంవత్సరంలో రూ.6 వేలకోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించారు.

రవాణాశాఖలో  2018-19లో ఆదాయం రూ. 3224.98 కోట్లు కాగా 2022-23లో రూ. 4294.12 కోట్లు వసూలైంది, 95.42శాతం లక్ష్యాన్ని చేరుకుంది.  ఆర్థిక సంవత్సరం (2023-24) లో రూ.6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సమీక్షకు ముందు రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను సిఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్