Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్IPL: సొంత గడ్డపై రైజర్స్ కు మరో ఓటమి

IPL: సొంత గడ్డపై రైజర్స్ కు మరో ఓటమి

సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల వేటలో మరోసారి చతికిలపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 145 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 7 పరుగులతో ఓటమి పాలైంది. క్లాసేన్, సుందర్ లు పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులే ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 18వ ఓవర్లో 15 పరుగులిచ్చిన ముఖేష్ చివరి ఓవర్లో సత్తా చాటాడు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఒక్క పరుగు వద్ద ఓపెనర్ ఫిల్ సాల్ట్ (డకౌట్) వికెట్ కోల్పోయింది, 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్-25; డేవిడ్ వార్నర్-21; సర్ఫ్ రాజ్ ఖాన్-10, అమన్ ఖాన్-4 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ దశలో అక్షర్ పటేల్- మనీష్ పాండే కలిసి ఆరో వికెట్ కు 69 పరుగులు జోడించారు. అక్షర్ 34 బంతుల్లో 4 ఫోర్లతో 34; మనీష్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 34 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3; భువీ 2; నటరాజన్ 1 వికెట్ పడగొట్టారు. ముగ్గురు రనౌట్ వడం గమనార్హం.

హైదరాబాద్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ హ్యారీ బ్రూక్స్ (7) మరోసారి నిరాశ పరిచాడు. మయాంక్ అగర్వాల్ 39 బంతుల్లో 7 ఫోర్లతో 49; రాహుల్ త్రిపాఠి-15 పరుగులు చేయగా… అభిషేక్ శర్మ(5); కెప్టెన్ మార్ క్రమ్(3) విఫలమయ్యారు. ఈ దశలో హెన్రిచ్ క్లాసేన్ – వాషింగ్టన్ సుందర్ లు నిలదొక్కుకొని ఆడారు. క్లాసేన్ 19 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్ తో 31 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటయ్యాడు. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 137 పరుగులు చేసింది. సుందర్ 24 పరుగులతో క్రీజులో నిలిచాడు.

ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్, నార్త్జ్ చెరో 2; ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

అక్షర్ పటేల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్