మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు తీరుపై కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా విచారణతోపాటు ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. వివేకా పెదనాన్న గురించి, చనిపోయిన వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ గురించి మాట్లాడలేక … ఎన్ని ఆరోపణలు తనపై, తన తండ్రి భాస్కర్ రెడ్డిపై వచ్చినా ఇప్పటి వరకూ ఏమీ మాట్లాడలేదని వివరించారు. సిబిఐ దర్యాప్తు తీరుపై ప్రజలకు ఎన్నో విషయాలు, వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఓ వీడియోను అవినాష్ విడుదల చేశారు. రెండుసార్లు విచారణకు హారజైన తర్వాత దర్యాప్తు పక్కదారి పడుతున్న విషయం తెలిసిందన్నారు.
వైఎస్ అవినాష్ చెప్పిన ముఖ్యాంశాలు:
- ఘటన జరిగిన రోజు ఉదయమే జమ్మలమడుగు వెళ్లేందుకు బయల్దేరాను
- ఉదయం ఆరున్నరకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి విషయం చెబితే సంఘటనా స్థలానికి వెళ్లాను
- అప్పటికే బెడ్ రూమ్ లో రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నారు
- అనుమానం వచ్చి ఏదైనా అనుమాన్సాస్పద మరణమా అని పియె క్రిష్ణా రెడ్డిని అడిగాను
- సిబిఐ పూర్తిగా అప్రూవర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని విచారణ సాగిస్తోంది.
- వాచ్ మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా తనకు తెలిసిన విషయం చెప్పారు.
- నిందితులుగా ఉన్న నలుగురి గురించి స్పష్టంగా చెప్పారు.
- వివేకా లెటర్, ఫోన్ దాసిపెట్టమని కృష్ణా రెడ్డికి రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
- డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టవద్దని వివేకా రాశారు.
- హత్యలో స్వయంగా పాల్గొన్న వ్యక్తిని అప్రూవర్ గా మారిస్తే సునీత ఎందుకు అభ్యంతరం తెలియజేప్పలేదు?
- ఒక మర్డరర్ కు ఇంత రిలీఫ్ ఇస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు?
- దర్యాప్తు అధికారి రాం సింగ్ ఏకపక్షంగా విచారణ జరిపారు. ఆయన ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు?
- నిజం అనేది నిలకడగా ఉంటుంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. అబద్దాలతో కట్టిన కట్టడం కూలడంఖాయం
- టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి ద్వారా చంద్రబాబు తో టచ్ లో ఎందుకు ఉంటున్నారు?
- రఘురామ రాజు, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళతో ఎందుకు టచ్ లో ఉన్నారు?
- బాబుకు టార్గెట్ నేను, మా నాన్న కాదు, వైఎస్సార్ పార్టీని బలహీనపర్చడానికే ఇదంతా చేస్తున్నారు.