యశ్వసి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ తో పాటు హెట్మెయిర్ రాణించడంతో ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో రాహుల్ చాహర్ బౌలింగ్ లో తొలి మూడు బంతులకు 2, 1,1 పరుగులు లభించాయి, నాలుగో బంతిని ధృవ్ జురెల్ స్టాండ్స్ లోకి పంపి అధ్బుత విజయం అందించాడు.
ఈ మ్యాచ్ లో విజయం సాధించినా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే అనేక సమీకరణాలు ఉన్నాయి. బెంగుళూరు, ముంబై తర్వాతి మ్యాచ్ ల్లో ఓడిపోతేనే ఈ జట్టుకు అవకాశం ఉంటుంది.
పంజాబ్ ఇచ్చిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 12 వద్ద ఓపెనర్ జోస్ బట్లర్ (డకౌట్) వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు జైస్వాల్- పడిక్కల్ 73 పరుగులు జోడించారు. జైస్వాల్ 36 బంతుల్లో 8 ఫోర్లతో 50; దేవదత్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ సంజూ శామ్సన్ (2) విఫలం కాగా, హెట్మెయిర్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46; పరాగ్ 12 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. జురెల్-10, బౌల్ట్ 1 పరుగుతో నాటౌట్ గా నిలిచారు.
పంజాబ్ బౌలర్లలో రబడ 2, శామ్ కర్రన్, అర్ష్ దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, రాహూల్ చాహర్ తలా ఒక వికెట్ సాధించారు
ధర్మ శాలలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 50 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కస్తాల్లో పడింది. సిమ్రాన్ సింగ్(2), లివింగ్ స్టోన్ (9) లు విఫలం కాగా, కెప్టెన్ శిఖర్ ధావన్-17; అథర్వ తైడే-19 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో శామ్ కర్రన్-జితేష్ శర్మలు నాలుగో వికెట్ కు 64 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐదో వికెట్ కు కర్రన్-షారుఖ్ ఖాన్ లు ఐదో వికెట్ కు అజేయమైన 73 పరుగులు చేశారు. కర్రన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49; షారుఖ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో5 వికెట్ల నస్తానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో నవ్ దీప్ షైనీ 3; బౌల్ట్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.
దేవదత్ పడిక్కల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.