ప్రభాస్ బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించి దేశవిదేశాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించాడు కానీ.. ఈ రెండూ బాహుబలి రేంజ్ సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు ఆదిపురుష్ అంటూ వస్తున్నాడు. రామాయణం ఆధారంగా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. కృతి సనన్ సీతగా నటించింది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు.
అయితే.. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఇదేదో బొమ్మల సినిమాలా ఉందనే టాక్ వచ్చింది. అంతే కాకుండా హనుమాన్ పాత్ర సెట్ కాలేదని.. రావణుడు గెటప్ సరిగాలేదన్నారు. సీత పాత్రలో నటించే స్థాయి కృతి సనన్ కు లేదన్నారు. ఇలా చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఆదిపురుష్ మేకర్స్ గ్రాఫిక్స్ పై మళ్లీ వర్క్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై చాలా కాన్ సన్ ట్రేషన్ చేశారు. ఇటీవల ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేస్తే.. ఈ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులునే కాదు… సామాన్య ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంది.
ప్రభాస్ ఆహార్యానికి, స్క్రీన్ ప్రజెన్స్ కి ఫుల్ మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఆదిపురుష్ మూవీ పై అంచనాలు పెరిగాయి. ఇటీవల రిలీజ్ చేసిన జై శ్రీరామ్ పాట సినిమా పై గౌరవాన్ని పెంచింది. ఇప్పటి వరకు ఎన్నో రామాయణాలు తీసారు కానీ.. వాటిల్లో వానర సైన్యం గురించి పెద్దగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ కి కీలక ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థమవుతోంది. వానరసైన్యం రావణ లంక పై దాడి చేస్తున్నప్పుడు వచ్చే పాట ఇది. ఈ పాటతో.. ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. జూన్ 16న ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి.. ఆదిపురుష్ బాహుబలి రేంజ్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.