సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 68వ రోజు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో కొనసాగుతోంది. వడదెబ్బ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఐదు రోజుల విరామం తర్వాత ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామం నుంచి తిరిగి తన పాదయాత్ర ప్రారంభించారు. సిఎం కెసిఆర్ అక్రమాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే పాదయాత్ర చేపట్టినట్టు భట్టి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, కెసిఆర్ అక్రమాలను వెలికి తీస్తామని భట్టి హెచ్చరించారు.
రుక్కంపల్లి గ్రామం నుంచి మంగళవారం ఉదయం 7:30 గంటలకు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభం అయింది. రుక్కంపల్లి, చెన్రెడ్డిపల్లి, ఇప్పటూరు, మల్రెడ్డిపల్లి, కూచూరు, దొడ్డిపల్లి, కిష్టారం గ్రామాల్లో పాదయాత్ర. కొనసాగుతుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ మల్రెడ్డిపల్లి గ్రామంలో ఉంటుంది. రాత్రికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం కిష్టారం గ్రామాంలో బస చేస్తారు. జడ్చర్ల నియోజకవర్గంలో 68వ రోజు 12 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయనున్న భట్టి విక్రమార్క ఈరోజు రాత్రికి 794 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయనున్నారు.