మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు చేయడం.. ఈ రెండు చిత్రాలు మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఏ జోనర్ మూవీ..? మహేష్ ని కొత్తగా ఎలా చూపించనున్నారు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ముందుగా యాక్షన్ మూవీ అనుకున్నారు కానీ.. ఆతర్వాత ప్లాన్ మారింది. ఫ్యామిలీ స్టోరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
అయితే.. ఈ మూవీ టైటిల్ కోసం చాలా అనుకున్నారు కానీ.. ఇప్పుడు మే 31న ప్రకటించనున్నారు. త్రివిక్రమ్ తన సినిమాలకు అ అనే అక్షరంతో వచ్చేలా టైటిల్స్ పెడుతుంటారు. అతడు, అ ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల.. వైకుంఠపురములో.. ఇలా అ అనే అక్షరంతో టైటిల్ పెట్టడం అనేది త్రివిక్రమ్ కు సెంటిమెంట్. మహేష్ మూవీకి కూడా అ అనే సెంటిమెంట్ ని ఫాలో అయి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేయాలి అనుకున్నారు కానీ.. మహేష్ మాత్రం సెంటిమెంట్ ను పక్కన పెట్టి కథకు సరిపోయే టైటిల్ పెట్టమని చెప్పాడట.
త్రివిక్రమ్ తను డైరెక్ట్ చేసే సినిమాలకు అ అనే అక్షరంతో టైటిల్ పెడతారు కానీ.. తను స్ర్కీన్ ప్లే అందించిన సినిమాలకు అ సెంటిమెంట్ తో టైటిల్ పెట్టారు. భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు ఆయన వర్క్ చేశారు కానీ.. ఆ సెంటిమెంట్ తో టైటిల్ పెట్టలేదు. ఇక మహేష్ సెంటిమెంట్ ను పక్కపెట్టమని చెప్పడంతో బాగా ఆలోచించి ఈ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ కథకు కరెక్ట్ గా సరిపోతుంది అంటున్నారు. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది ఈ నెల 31న తెలుస్తుంది.