Saturday, November 23, 2024
HomeTrending Newsస్మార్ట్ మీటర్లపై సిబిఐ విచారణ: సోమిరెడ్డి డిమాండ్

స్మార్ట్ మీటర్లపై సిబిఐ విచారణ: సోమిరెడ్డి డిమాండ్

స్మార్ట్ మీటర్ల పేరిట 17 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని, దీనిలో విద్యుత్ శాఖ సిఎండిలు కూడా భాగస్వాములు అయ్యారని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అన్ని ప్రకృతి వనరులనూ దోచుకుని ఇప్పుడు ప్రజల జేబులు నేరుగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా ఈ దోపిడీ చేస్తున్నారన్నారు. ఒక మీటర్ ఖరీదు 36,975 గా నిర్ణయించారని, మోటార్ల కంటే మీటర్ల రేటు ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరమన్నారు.

అదానీ కంపెనీ ఉత్తర ప్రదేశ్ లో మీటర్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ రేటు roo.10 v eలుగా నిర్ణయిస్తే యోగి ప్రభుత్వం తిరస్కరించిందని, కానీ ఇక్కడ 36975 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. అదానీ యూపీకి వద్దు- ఏపీలో ముద్దు అన్నట్లుగా తయారైందన్నారు. రాజస్థాన్ లో మీటర్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్  7,943 (ఐదేళ్ళ నిర్వహణ) మాత్రమే ఉందన్నారు.  ఈ 17వేల కోట్లను ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపైనే భారం వేస్తున్నారని విమర్శించారు. డిస్కంలకు 78వేల కోట్ల రూపాయలు చెల్లించాలని, విద్యుత్ వ్యవస్థ  కుప్పకూలుతోందని.. కానీ ఈ ప్రభుత్వం బొగ్గు, విద్యుత్ కొనుగోలు లో కూడా దోపిడీ చేస్తున్నారని… ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది సార్లు చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. షిర్డీ సాయి ఆఫీసులో  సిఎండి, ఇతర అధికారులు కూర్చుని ఈ కుంభకోణం చేశారని… దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఏ ఒక్క వినియోగాదారుడూ ఫిర్యాదు చేయకపోయినా మార్గదర్శిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్న సిఐడికి ఈ స్మార్ట్ మీటర్ల కుంభకోణం కనబడలేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్